BJP Incharges to Munugodu మునుగోడు బహిరంగ సభకు మండలాలా వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. చౌటుప్పల్ పురపాలిక బాధ్యతలను గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డికి అప్పగించారు. మునుగోడుకు ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డికి బాధ్యతలిచ్చారు.
సంస్థాన్ నారాయణాపూర్ మండలానికి కూన శ్రీశైలం గౌడ్, రవీంద్ర నాయక్ పేర్లను ఖరారు చేశారు. నల్గొండ జిల్లాలోని చండూరు మండలానికి చాడా సురేష్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ నియామిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. చండూరు మున్సిపాలిటీకి రాజాసింగ్, విజయపాల్ రెడ్డి నియమించగా.. గట్టుప్పల్‌కు రఘునందన్ రావు, రాపోలు ఆనందభాస్కర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. మర్రిగూడెంకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తల్లోజు ఆచారిని పేర్లను ఖరారు చేయగా.. నాంపల్లి మండలానికి చంద్రశేఖర్, ధర్మారావును నియమించారు.