తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని భాజపా నాయకుల డిమాండ్ - Dubbaka by elections 2020

సిద్దిపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అరెస్టుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

BJP protest in bhuvanagiri
సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని భాజపా నాయకుల డిమాండ్

By

Published : Oct 27, 2020, 4:31 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను అరెస్టు చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్యామ్​ సుందర్​తో పాటు కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details