యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. కేసులు పెరిగేందుకు ప్రభుత్వమే పరోక్షంగా కారణమవుతున్నదని భాజపా నేతలు ఆరోపించారు. కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి.. ఉచితంగా వైద్యం అందించాలని.. పరీక్షల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.
కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వమే కారణమని భాజపా ధర్నా - Yadadri Bhuvanagiri Newws
తెలంగాణలో కరోనా కేసలు రోజురోజుకు రెట్టింపు కావడానికి తెరాస ప్రభుత్వమే కారణమని యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి.. ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
![కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వమే కారణమని భాజపా ధర్నా BJP Protest Against Government In Yadagiri Gutta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7724928-379-7724928-1592832931585.jpg)
కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వమే కారణమని భాజపా ధర్నా
కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్‌ని రాష్ట్రంలో అమలు చేసి.. పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సరిపడా పీపీఈ కిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంటిపల్లి సత్యం, జిల్లా నాయకులు రచ్చ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం నేత కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనాతో ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది!