తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కూరులో భాజపా ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం - తెలంగాణ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రైతుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలు వారికి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మోత్కూరు భాజపా పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

మోత్కూరులో భాజపా ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం
మోత్కూరులో భాజపా ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం

By

Published : Oct 15, 2020, 11:50 PM IST

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన చట్టాలు అన్నదాతలకు ఉపయోగకరంగా ఉన్నాయని తెలియజేస్తూ మోత్కూరు పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. నూతన చట్టం వల్ల రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉందని అన్నారు. పంటకు ధరను నిర్ణయించుకునే అధికారం రైతులకు ఉంటుందని భాజపా నాయకులు పేర్కొన్నారు.

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాజపా యువ మోర్చా అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మరాటి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు: సీఎం

ABOUT THE AUTHOR

...view details