దేశం, రాష్ట్రంలో.. భాజపా ప్రాబల్యం అనూహ్యంగా పెరుగుతోందని ఆ పార్టీ నేత మురళీధర్ రావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి.. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. రెండు స్థానాల్లోనూ భాజపానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'మేము.. హామీలిచ్చి మర్చిపోయే రకం కాదు' - అయోధ్య రామ మందిరం
భాజపా.. ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతుందని ఆ పార్టీ నేత మురళీధర్ రావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు స్థానాల్లోనూ భాజపానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'మేము.. హామీలిచ్చి మర్చిపోయే రకం కాదు'
భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపిందన్నారు మురళీధర్ రావు. తెరాసలా.. వాగ్ధానాలిచ్చి మర్చిపోయే రకం కాదని విమర్శించారు. 370 జీవో, అయోధ్య రామ మందిరాలను సాధించిన ఘనత మోదీ ప్రభుత్వానిదంటూ కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టిన గతే తెరాసకు పట్టనుందని జోస్యం చెప్పారు.