రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయటంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలన్నిటినీ ప్రభుత్వం కల్పించాలని...ఉమ్మడి నల్గొండ, ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రిలో భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మార్పు కోసం తనకు ఒక్క అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వండి: ప్రేమేందర్ రెడ్డి - తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉద్యోగులు డిమాండ్ చేసినట్లుగా 45 శాతం కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వండి: ప్రేమేందర్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని ప్రేమేందర్ రెడ్డి కార్యకర్తలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడంలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకే నిరుద్యోగభృతిని ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు డిమాండ్ చేసినట్లుగా వారికి 45 శాతం కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:నీటిపారుదల శాఖలో మార్పులు... ఉత్తర్వులు జారీ