యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా తలపెట్టిన బైక్ ర్యాలీకి అనుమతివ్వలేదని ఆగ్రహించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. యాదగిరిగుట్టలో తాను పాల్గొనే బైక్ ర్యాలీకి పోలీసులు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: రాజా సింగ్ - పుర పోరు
తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని భాజపా నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదరిగుట్టలో కమలం దండు తలపెట్టిన బైక్ ర్యాలీకి అనుమతివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: రాజా సింగ్
ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస నిలబెట్టుకోలేకపోయిందన్నారు. యాదగిరిగుట్టలో ఒక్కసారి భాజపాకు అవకాశమిచ్చి చూడండని కోరారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని ఆరోపించారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు