తెలంగాణ

telangana

ETV Bharat / state

నీట మునిగిన పంటలను పరిశీలించిన భాజపా నేతలు - యాదాద్రిలో పొలాలను పరిశీలించిన భాజపా నేతలు

రెండురోజులుగా కురిసిన కుండపోత వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్​ మండలం ముత్తిరెడ్డిగూడెంలో వర్షానికి నీట మునిగిన పంటను భాజపా నేతలు పరిశీలించారు.

bjp leaders visited at alerru submerged crops
మోటకొండూర్​లో నీట మునిగిన పరిశీలించిన భాజపా నేతలు

By

Published : Oct 15, 2020, 9:07 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో భాజపా శ్రేణులు పర్యటించారు. అకాల వర్షానికి నీట మునిగిన పంటల వల్ల రైతులకు పరిహారం చెల్లించాలంటూ ముత్తిరెడ్డిగూడెం చౌరస్తా వద్ద నినాదాలు చేశారు.

జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా రైతుల గోస కన్నీళ్లు తెప్పిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకరానికి రూ.50 వేలు, పత్తికి రూ.75 వేలు పరిహారం రైతులకు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:జలాశయాలకు జలకళ.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ABOUT THE AUTHOR

...view details