'ఎమ్మెల్యే సారూ.. రాజీనామా చెయ్' అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద హోర్డింగ్ వెలిసింది. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఎమ్మెల్యేపై ప్రజలు ఒత్తిడి తేవాలని.. భాజపా రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు రావాలంటే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీ హోర్డింగ్‌లో పేర్కొన్నారు.
BJP HOARDING IN BHUVANAGIRI: 'ఎమ్మెల్యే సారూ.. రాజీనామా చెయ్'.! - bjp leaders put hoardings in bhuvanagiri
రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాజీనామాల సెగ తగులుతోంది. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే మా జీవితాలు బాగుపడతాయంటూ ప్రజల తరపున భాజపా నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజీనామాతోనే సీఎం కేసీఆర్ దళితుల కోసం పథకం పెట్టారని వ్యాఖ్యానిస్తూ.. భువనగిరిలో ఆ పార్టీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. ఇంతకీ అదేంటంటే..
భువనగిరిలో భాజపా హోర్డింగ్
'మీ రాజీనామాతో మా దళిత కుటుంబాలను కేసీఆర్ ఆదుకుంటారు' అని భువనగిరిలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అటుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు ఆసక్తిగా ఆ ఫ్లెక్సీలను చూశారు. భాజపా నాయకులు ఆ హోర్డింగ్ ఏర్పాటు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ దళిత ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు ఇచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:KTR: 'కేసీఆర్ సీఎం అయ్యాక సిరిసిల్లకు మంచిరోజులు'