ఇటీవల ముగిసిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందాలని హైదరాబాద్‌లోని మీర్‌పేట నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట వరకు బీజేపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. వైకుంఠ ద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి చేరుకున్న భాజపా శ్రేణుల పాదయాత్ర - భాజపా శ్రేణుల పాదయాత్ర
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలవాలంటూ పార్టీ శ్రేణులు చేపట్టిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకుంది. యాదాద్రిలో స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. విజయం వరించాలని స్వామివారిని కోరుకున్నట్లు వారు తెలిపారు.
![యాదాద్రి చేరుకున్న భాజపా శ్రేణుల పాదయాత్ర BJP Leaders padha yatra reach yadadri to win bjp leader on dubbaka sub election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9476766-272-9476766-1604831298606.jpg)
యాదాద్రి చేరుకున్న భాజపా శ్రేణుల పాదయాత్ర
భాజపా అభ్యర్థిని విజయం వరించాలని కోరుకున్నట్లు వారు వెల్లడించారు. తెరాస పాలనకు అంతం దుబ్బాక నుంచే మొదలవుతుందన్నారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.