సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరపాలని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండల తహసీల్దార్ లకు భాజపా నాయకులు వినతి పత్రం అందించారు. తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారన్నారు. ప్రతీ పోరాట స్థలాన్ని స్మృతి వనంగా మార్చాలని వారు డిమాండ్ చేశారు.
'అమరుల ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు' - ఎమ్మార్వోలకు భాజపా నాయకుల వినతి పత్రం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండల తహసీల్దార్ లకు భాజపా నాయకులు వినతి పత్రం అందించారు. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరపాలని అందులో పేర్కొన్నారు.
'అమరుల ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు'
అమరుల ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్... తుంగలో తొక్కుతున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కో- కన్వినర్ తుమ్మల మురళీధర్, మల్లారెడ్డి, ఏనుగు జితేందర్ రెడ్డి, గజరాజు కాశినాథ్, గౌరు శీను, మరాటి అంజయ్య, సజ్జనం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.