BJP Campaigned Munugode bypoll: మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో భాజపా నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చండూరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. నియోజకవర్గ ఓటర్లను కలుసుకున్న ఆయన.. పేదోడు చచ్చిపోతే.. పెద్దోడు రాజ్యమేలుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుందన్న బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
తెరాస సర్కార్ మునుగోడును నిర్లక్ష్యం చేసిందని రాజగోపాల్ రాజీనామాతో నేతలంతా గ్రామాలకు వస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్‌ను.. తిరిగి గెలిపించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం సింగారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు.