తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదు'

భునాదిగాని కాలువ నిర్మాణం పూర్తి అయితే మూడు, నాలుగు మండలాలు సస్యశ్యామలం అవుతాయని భాజపా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పి.వి.శ్యాంసుదర్​రావు అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు.

bjp-leader-visit-mothkur-municipality-in-yadadri-bhuvanagiri-district
అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై దృష్టిసారించాలి

By

Published : Aug 24, 2020, 9:44 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో అసంపూర్తిగా నిలిచిన పలు అభివృద్ధి పనులను భాజపా జిల్లా అధ్యక్షుడు పి.వి.శ్యాంసుదర్​రావు పరిశీలించారు. సుమారు 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన భూనాదిగాని కాలువ నేటికీ అసంపూర్తిగానే ఉందన్నారు. కాలువ కింద భూమి కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం నేటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని.. వెంటనే ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టిసారించి కాలువలను పూర్తి చేస్తే మూడు, నాలుగు మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు.

పట్టణంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్​ వద్ద నాణ్యత లోపించిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఏరియా ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం స్థానిక సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన గణేశ్​ పూజలో పాల్గొన్నారు. కరోనా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆక్షలు విధించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details