ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేసి అర్హులైన పేదలకు రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా నేతలు ధర్నాకు దిగారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఎల్ఆర్ఎస్ గుదిబండలా మారిందని విమర్శించారు.
'ఎల్ఆర్ఎస్ రద్దు చేసి.. ఇళ్లు కట్టించండి'
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా నేతలు ధర్నాకు దిగారు. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
lrs
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి :కొవాగ్జిన్ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు: గవర్నర్