తెలంగాణ

telangana

ETV Bharat / state

మేము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి - Rajagopal Reddy comments on Counting

Rajagopal Reddy on Counting: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. చౌటుప్పల్‌లో తాము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదని తెలిపారు. మిగిలిన మండలాల్లోనూ పోరు హోరాహోరీగా సాగనుందని వివరించారు.

మేము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి
మేము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి

By

Published : Nov 6, 2022, 11:18 AM IST

Rajagopal Reddy on Counting: మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు.. హోరాహోరీగా సాగుతున్నాయని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తాము అనుకున్న చౌటుప్పల్‌ మండలం, సంస్థాన్‌ నారాయణపురంలో.. భాజపాకు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదని ఆయన తెలిపారు. రౌండ్‌ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయని.. ఆఖరి రౌండ్‌ వరకు హోరాహోరీగా పోరు సాగనుందని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

ఉప ఎన్నిక ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. చౌటుప్పల్‌ మండలం, నారాయణపురంలో భాజపాకు ఓట్లు తగ్గాయి. మిగిలిన మండలాల్లో హోరాహోరీ పోరు సాగుతుంది. - రాజగోపాల్‌రెడ్డి, భాజపా అభ్యర్థి

మేము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details