యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గంధమల్ల రిజర్వాయర్ వరకు బయల్దేరిన బైక్ ర్యాలీని స్థానిక పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్ట్ చేశారు. సీపీఎం నాయకులకు ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్ సంఘీభావం తెలిపారు.
'గంధమల్ల రిజర్వాయర్‌పై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి' - latest news of yadadri bhuvanagiri
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
'గంధమల్ల రిజర్వాయర్‌పై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి'
గంధమల్ల రిజర్వాయర్ ఉందో లేదో సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని, ఈ రిజర్వాయర్ కోసం ఎటువంటి ఉద్యమం అయిన చేయడానికి సిద్ధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్ పనులను చేపట్టి రైతులకు నీరందే విధంగా పనులు జరిపించాలని వారు కోరారు.
ఇవీ చూడండి:'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!