యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారుఢీకొట్టింది. ప్రమాదంలో భర్త మల్లారెడ్డి మృతి చెందగా... భార్య భారతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్కు చెందిన మల్లారెడ్డి దంపతులు బుధవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో తన కూతురు గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈరోజు ఉదయం తిరిగి హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా.. బీబీనగర్ మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద వెనకగా వస్తున్న కారు ఢీకొట్టింది.