భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తెరాస నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భాజపా నుంచి శ్యాంసుందర్ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. బూర నర్సయ్యకు బీసీ సామాజిక వర్గం అండగా ఉండగా.. కోమటిరెడ్డికి గతంలో సోదరుడు రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు సానుకూలంగా ఉన్నాయి. మూసీ నది ప్రక్షాళన కోసం చేసిన పాదయాత్రే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు భాజపా అభ్యర్థి శ్యాంసుందర్.
భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల బలాబలాలు - bjp shaysunder
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. గత ఐదేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే ధీమాతో బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. సంస్థాగతంగా కార్యకర్తలు బలంగా ఉండటం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉన్న సానకూలాంశం.

భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల బలాబలాలు