తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు

దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు రాచకొండ కమిషనరేట్​ భువనగిరి జోన్​ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. నిందితులు ఏపీ రాజమండ్రి జిల్లాకు చెందినట్లుగా పేర్కొన్నారు.

దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు
దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు

By

Published : Nov 30, 2019, 1:58 PM IST

దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పలు మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను నిన్న వలిగొండ మండలం గోకారం స్టేజీ వద్ద పట్టుకున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ రాజమండ్రి జిల్లాకు చెందిన సూరంపూడి వెంకట రమణ భువనగిరిలో కోర్టు ప్రక్కన నర్సరీ నిర్వహిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పటి అందులో పనిచేస్తున్న మరో ఇద్దరితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు నారాయణ వెల్లడించారు. వీరిపై గతంలో బీబీనగర్ వలిగొండ మండలాల్లో పలు కేసులు ఉన్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details