యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ఓ ఫామ్ హౌస్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బోడుప్పల్కి చెందిన తోటకూర చందర్, రవి యాదవ్, విజయ్ కుమార్, వెంకట్, భువనగిరి పట్టణానికి చెందిన సురేష్, వెంకట కృష్ణ, వీరవల్లికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు.
భువనగిరిలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ - ఏడుగురు వ్యక్తుల అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ఓ ఫామ్ హౌస్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 వేల రూపాయలు, 7 చరవాణులు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

భువనగిరిలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
వారి వద్ద నుంచి 78 వేల రూపాయల నగదు, 9 సెట్ల కార్డులు, 7 చరవాణులు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరందరినీ భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!