తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో వైద్య సిబ్బంది పోరాటం అనిర్వచనీయం: కోమటిరెడ్డి - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో మూడు నూతన అంబులెన్సు​లను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీ నిధుల నుంచి దాదాపు రూ.38 లక్షల విలువ గల 3 అంబులెన్సులను ఆయన అందజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

bhuvanagiri-mp-komatireddy-venkat-reddy-inaugurated-3-ambulances-in-yadadri-bhuvanagiri-collectorate
పీహెచ్​సీల్లో వెంటిలేటర్లు అందించడానికి కృషి: ఎంపీ కోమటిరెడ్డి

By

Published : Jan 26, 2021, 3:42 PM IST

కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విలువైన సేవలను అందించిన వైద్య సిబ్బందిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో 3 నూతన అంబులెన్సు​లను జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ నిధుల నుంచి రూ.38 లక్షల విలువ గల 3 అంబులెన్సులను భువనగిరి, ఆలేరు, రామన్నపేటకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించి జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకి అప్పగించారు.

రానున్న రోజుల్లో ఎంపీ నిధులతో మరిన్ని అంబులెన్సు​లను అందిస్తామని హామీ ఇచ్చారు. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన వెంటిలేటర్లను గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్​సీల్లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇంకా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:అంబేడ్కర్​ వల్లే అట్టడుగు వర్గాలు చట్ట సభల్లో..: మంత్రి హరీశ్

ABOUT THE AUTHOR

...view details