ఎల్‌ఆర్‌ఎస్‌ను బేషరతుగా రద్దు చేయాలని... ఇన్ని రోజులు ప్రజలను ఇబ్బందులు పెట్టిన సీఎం కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందన్న ఎంపీ... ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సూచించారు.
సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలి: కోమటిరెడ్డి - mp komatireddy venkat reddy allegations on kcr
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన సీఎం కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకుంటే...కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని కోమటిరెడ్డి హెచ్చరించారు.
![సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలి: కోమటిరెడ్డి bhuvanagiri mp komatireddy venkat reddy fire on cm kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10317047-351-10317047-1611160616539.jpg)
bhuvanagiri mp komatireddy venkat reddy fire on cm kcr
ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతకాలనుకున్న ప్రజలను సీఎం కేసీఆర్... తన తుగ్లక్ పాలనతో సమస్యల వలయంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకుంటే... కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని కోమటిరెడ్డి హెచ్చరించారు.