యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని సాకంపల్లిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మంచినీటి వాటర్ ఫిల్టర్, ముత్తిరెడ్డి గూడెంలో ఎంపీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అదే గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చాడ శశిధర్ రెడ్డిని ఎంపీ పరామర్శించారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు : ఎంపీ - భువనగిరి జిల్లా సాకంపల్లి పర్యటించిన ఎంపీ కోమటిరెడ్డి
యాదాద్రి జిల్లా సాకంపల్లిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అధికార పార్టీ పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు : ఎంపీ
అధికార పార్టీ అండదండలతో అక్రమాకేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎలాంటి భయాలకు గురి కావొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అధికారం ఉందని అక్రమ కేసులు పెడితే ఉరుకోమన్నారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు'
TAGGED:
No fear of illegal cases