విద్యుత్ సమస్యల పరిష్కారానికై ఫోన్-ఇన్ - bhuvanagiri
విద్యుత్ సమస్యల పరిష్కారానికి భువనగిరి డీఈ ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని కృష్ణ హామీ ఇచ్చారు.
భువనగిరి డీఈ ఫోన్-ఇన్
భువనగిరి డివిజన్ పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈనాడు ఆధ్వర్యంలో డీఈ కృష్ణ ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించారు. మండలాల నుంచి గ్రామాల నుంచి రైతులు, వినియోగదారులు ఫోన్ చేసి సమస్యలను డీఈ దృష్టికి తీసుకువచ్చారు. కరెంట్ బిల్లులో తేడాలు, లోవోల్టేజీ సమస్యలు, సిబ్బంది సేవా లోపం తదితర అంశాలపై వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.