యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా వరద పోటెత్తింది. చౌటుప్పల్లోని 13వ వార్డులో వరద నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత వార్డులో పర్యటించిన డీసీపీ నారాయణరెడ్డి బాధితులకు భోజనం, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన డీసీపీ - flood hits bhuvanagiri district
రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ముంచెత్తింది. ముంపునకు గురైన చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డులో వరద బాధితులకు డీసీపీ నారాయణరెడ్డి.. భోజనం, బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన డీసీపీ
రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా ఇన్ఫోసిస్ సంస్థ ఆధ్వర్యంలో.. సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు బాధితులకు సాయం చేశామని డీసీపీ తెలిపారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలెవరూ భయపడవద్దని చెప్పారు. మరో రెండ్రోజులు వర్షాలుండటం వల్ల ముంపు ప్రాంత ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.