ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అరెస్టు
స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళనకు దిగారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని పోలీసులు కోమటిరెడ్డిని అరెస్టు చేశారు.
ఐదేళ్లుగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్.. ప్రజాప్రతినిధులను మోసం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన పార్టీ శ్రేణులకు మద్దతు తెలిపారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఎంపీ కోమటిరెడ్డిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుతగలడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలుకు తీవ్ర గాయమైంది.
- ఇదీ చూడండి : అసోం ఎన్ఆర్సీ: 71ఏళ్ల వివాదానికి రేపే తెర!