భువనగిరి జిల్లా కేంద్రమైన తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగింది. హైదరాబాద్-వరంగల్ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుండడంతో రద్దీ ఎక్కువవుతోంది. బైపాస్ రోడ్డు వేసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు.
జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి సాయిబాబా టెంపుల్ వరకు రోడ్డు చిన్నగా ఉండి, విభాగిని పెద్దగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. పోలీసులు చలాన్లు రాస్తున్నారే తప్ప, సమస్యను పరిష్కరించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
పట్టణంలో రోడ్డు విభాగినిని పెద్దదిగా నిర్మించడంతో రోడ్డు ఇరుకుగ మారిపోయింది. దీనికి తోడు రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే ఈ ట్రాఫిక్ కష్టాలు నుంచి కొంచెం బయట పడవచ్చని స్థానికులు కోరుతున్నారు.
పనిచేయని సిగ్నల్ వ్యవస్థ
ముఖ్యంగా పట్టణంలోని వినాయక నగర్ చౌరస్తా, జగదేవ్ పూర్ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు సిగ్నల్స్ ఏర్పాటు చేసినా, అవి పూర్తిస్థాయిలో పనిచేయట్లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బాబు జగ్జీవన్ రామ్ సెంటర్ వద్ద రైతు బజార్ వుండడంతో అక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్లోనే కాదు... భువనగిరిలోనూ ట్రాఫిక్ కష్టాలు ఇదీ చూడండి:చంద్రయాన్ 2 కు సాయంత్రం నుంచి కౌంట్ డౌన్