యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్‌కు లిఫ్టుల ద్వారా గోదావరి నీళ్లను మళ్లించుకుంటున్నారని ఆరోపించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కాలువల ద్వారా ఆలేరు నియోజకవర్గానికి ఏవిధంగా నీళ్లిస్తారని ప్రశ్నించారు.
'ఆలేరును ఏడారి చేస్తోన్న కేసీఆర్ సర్కార్' - MP Komatireedy venkat reddy on Gandamalla reservoir
ముఖ్యమంత్రి కేసీఆర్ గందమల్ల రిజర్వాయర్ పనులను పూర్తి చేయకుండా ఆలేరు నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆలేరును ఏడారి చేస్తోన్న కేసీఆర్ సర్కార్
గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గందమల్ల రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అసమర్థుడైన వ్యక్తి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుతం వస్తున్న కరెంట్ బిల్లులను పేదవారు ఇళ్లు అమ్ముకున్నా కట్టలేని విధంగా బాదేశారని మండిపడ్డారు. అధికంగా వచ్చిన కరెంట్ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కట్టవద్దని సూచించారు.