తెలంగాణ

telangana

ETV Bharat / state

10 వేల రంగులతో చీర.. మీరెప్పుడైనా చూశారా..? - The couple weaved 10000 colors saree

Saree With Ten Thousand Colours : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య 10 వేల రంగులు వచ్చేలా చీరను తయారు చేశారు. వ్యాట్‌ అండ్‌ ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించి 100 పేక చిటికీలు, 100 నిలువు చిటికీలతో 10 వేల వర్ణాలు వచ్చేలా వస్త్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. చీరకు రెండు కొంగులు వచ్చేలా తయారు చేయడం మరో విశేషం.

Saree With Ten Thousand Colors
Saree With Ten Thousand Colors

By

Published : Dec 22, 2022, 9:54 PM IST

పదివేల రంగులు వచ్చేలా చీర తయారు చేసిన నేతన్న..

Saree With Ten Thousand Colours : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య.. పది వేల రంగులు వచ్చేలా చీర తయారు చేసి అబ్బురపరిచారు. ఫైన్ కాటన్ సిల్క్ మిక్స్‌డ్ ఇక్కత్ చీరను రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వ్యాట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రంగులను వినియోగించి 100 పేక చిటికీలు, 100 నిలువు చిటికీలతో 10 వేల వర్ణాలు వచ్చే విధంగా వస్త్రాన్ని రూపొందించారు.

చీర తయారీ కోసం భార్య సరస్వతితో కలిసి ఏడాది పాటు కష్టపడ్డారు. గతంలో ఒక చీరకు, మధ్యలో భారతదేశ పఠం వచ్చేలా నేసినందుకు గానూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆధునిక ఫ్యాషన్ రంగంలో చేనేత నిలబడాలంటే కొత్త డిజైన్లు వేస్తే కానీ అవకాశాలను అందిపుచ్చుకోలేమని, చేనేత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నానని తెలిపారు.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details