భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో దేవతా మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు.
యాదాద్రిలో ఘనంగా భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో దేవతా మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు.
యాదాద్రిలో ఘనంగా భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు
యాదాద్రి ఆలయంలో సుప్రభాత సేవతో మొదలైన వేడుకలో అర్చకులు నిత్య కైంకర్యాలు, అభిషేకం, సుదర్శన నారసింహ హోమంతో స్వామి వారికి సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజుల్లో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టడం ఆనవాయితీగా వస్తొందని పూజారులు తెలిపారు. ఈ వేడుకలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.