తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంపై బంద్​ ప్రభావం.. భక్తులు లేక వెలవెల - yadadri district latest news

రైతు సంఘాలు ఇచ్చిన భారత్​ బంద్​ ప్రభావం యాదాద్రి ఆలయంలో స్పష్టంగా కనిపించింది. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఆలయ పరిసరాలు బంద్​ కారణంగా బోసిపోయి కనిపించాయి.

bharat bundh effect on yadadri temple
యాదాద్రి ఆలయంపై బంద్​ ప్రభావం.. భక్తులు లేక వెలవెల

By

Published : Dec 9, 2020, 6:12 AM IST

భారత్ బంద్ పిలుపుతో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య మంగళవారం గణనీయంగా తగ్గింది. కార్తీక మాసం సందర్భంగా జరగాల్సిన భక్తుల వ్రత పూజలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఆలయ పరిసరాలు, కల్యాణ కట్ట, వసతి గదుల సముదాయాలు, వ్రత మండపం, నిత్య కల్యాణం, దర్శన క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్​లు భక్తులు లేక బోసిపోయి కనిపించాయి.

యాదాద్రి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల బస్టాండ్ ప్రాంగణం వెలవెలబోయింది. ఈ క్రమంలోనే యాదాద్రి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో కాస్త ఇబ్బందులు పడ్డారు.

మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ

ABOUT THE AUTHOR

...view details