రైతులకు మద్దతుగా దుకాణాలు మూసి బంద్‌కు సహకరించాలని సీపీఐ నేత కళ్లెం కృష్ణ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతుగా స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై వివిధ పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు.
రైతు బతుకును కార్పొరేట్‌కు అప్పగించేందుకే కొత్త చట్టాలు: సీపీఐ - వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్
యాదగిరిగుట్టలోని ఆర్టీసీ డిపో ఎదుట వివిధ పార్టీల నాయకులు బైఠాయించారు. దుకాణాలు మూసేసి రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని సీపీఐ నేత కళ్లెం కృష్ణ అన్నారు. రైతు బతుకులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే ఈ చట్టాలు అని ఆయన ఆరోపించారు.

రైతు బతుకును కార్పొరేట్‌కు అప్పగించేందుకే కొత్త చట్టాలు: సీపీఐ
కార్పొరేట్ సంస్థలకు రైతు బతుకులను అప్పగించేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు అని ఆరోపించారు. రాష్ట్రంలో బంద్‌ను విజయవంతం చేసి దిల్లీలోని రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ ఆందోళనలో తెరాసతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.