యాదాద్రిలో బెల్లం లడ్డూ తయారీ - sri lakshmi narasimha swamy
భక్తులకు విక్రయించే ప్రసాదాల్లో బెల్లం లడ్డూ తయారిని యాదాద్రి దేవస్థానం ప్రారంభించింది. దానిలో వాడే దినుసులు, పాకం తయారీ, సమయం వివరాలతో కూడిన నివేదికను 11 మంది సభ్యులతో కూడిన కమిటీ దేవాదాయ కమిషనర్‌కు అందజేయనుంది.

బెల్లం లడ్డూ తయారీ
భక్తులకు విక్రయించే ప్రసాదాల్లో బెల్లం లడ్డూ తయారీ ప్రక్రియకు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం గురువారం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ నిర్వాహకులు ఐదు రోజులుగా బెల్లం లడ్డూల తయారీపై కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఆలయ ఈవో 11 మంది ఉద్యోగులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించారు. ఐదుగురు ఏఈవోలు, ఇద్దరు ప్రధాన పూజారులు, మరో ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులతో ఏర్పాటైన కమిటీ గురువారం లడ్డూల తయారీ చేపట్టింది.
బెల్లం లడ్డూ తయారీ