తెలంగాణ

telangana

ETV Bharat / state

అనారోగ్యంతో.. యాచకుడు మృతి! - యాదాద్రి జిల్లా వార్తలు

కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పట్టించుకునే దిక్కు లేక.. ఆదుకునే నాథుడు లేక యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ యాచకుడు ప్రాణాలు విడిచాడు. గుట్టలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే.. మేడ్చల్​కు చెందిన లక్ష్మీ నారాయణ తీవ్ర అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

begger died in Yadagirigutta
అనారోగ్యంతో.. యాచకుడు మృతి!

By

Published : Sep 18, 2020, 10:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తీవ్ర అనారోగ్యంతో ఓ యాచకుడు ప్రాణాలు విడిచాడు. మేడ్చల్​ జిల్లా మచ్చ బొల్లారం తిరుమలగిరికి చెందిన లక్ష్మీ నారాయణ.. కొద్ది రోజులుగా యాదగిరిగుట్టలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ.. ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details