యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని రాచకొండ గుట్టల్లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి నీరు జాలువారుతూ ఆకట్టుకుంటున్నాయి. ఎంతో ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం కుంటాల, బొగత జలపాతాన్ని తలపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సుందర దృశ్యాలు తిలకించేందుకు వస్తున్నారు. రెండు గుట్టల నడుమ జలపాతంలో స్నానాలు చేస్తూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు.
రెండు గుట్టల మధ్యలో జలసోయగం - రాచకొండ గుట్టల్లో అందమైన జలపాతం
అటవీ ప్రాంతంలో పాల లాంటి తెల్లని నీరు... రెండు కొండల మధ్యలోంచి కిందకు దూకుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ గుట్టల్లో ఈ దృశ్యం కనువిందు చేస్తోంది.
రెండు గుట్టల మధ్యలో జలసోయగం