యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన బాలగోని గంగాభవాని గర్భిణీ. ఆమెకు పురిటి నొప్పులు రాగా.. కుటుంబ సభ్యులు 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొలీస్ వాహనంలో సమయానికి స్థానిక బీబీనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన పోలీసులకు గంగా భవాని కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వారిని అభినందించారు.
పోలీసు వాహనంలో ఆసుపత్రికి గర్భిణీ.. స్థానికుల ప్రశంసలు - corona latest updates
నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే సకాలంలో స్పందించారు బీబీనగర్ పోలీసులు. గర్భిణీని సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి స్థానికుల మన్ననలను పొందారు.
మానవత్వం చాటుకున్న బీబీనగర్ పోలీసులు