యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపటి నుంచి బతుకమ్మ చీరలు పంచనున్నట్టు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాకు 2 లక్షల 50 వేల బతుకమ్మ చీరలు వచ్చాయని.. వాటన్నింటినీ ఇప్పటికే.. మండలాలకు చేర్చామన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని భువనగిరి ఎమ్మార్వో జనార్ధన్ రెడ్డి తెలిపారు.
రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ : కలెక్టర్ - భువనగిరి తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి బతుకమ్మ చీరలు మండలాలకు చేరుకున్నాయని ఆమె తెలిపారు.
రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ : కలెక్టర్
గురువారం సాయంత్రం కల్లా.. బతుకమ్మ చీరలుమండల కేంద్రాల నుంచి గ్రామాలకు చేరుకుంటాయన్నారు. గ్రామాలలో విలేజ్ లెవెల్ కమిటీ ద్వారా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు ఎమ్మార్వో వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఇంటింకే చీరలు పంపనున్నట్టు ఆయన తెలిపారు.