తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్వాపురం భూ నిర్వాసితుల ధర్నా - Baswapuram Project land expatriates Strike

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్​ వద్ద బస్వాపురం భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. అనంతరం వరంగల్​ - హైదరాబాద్​ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఫలితంగా రోడ్డుపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Baswapuram Project land expatriates Strike at Ydadri Bhuvanagiri collectarate
బస్వాపురం భూ నిర్వాసితుల ధర్నా

By

Published : Jul 14, 2020, 12:01 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బీఎన్​ తిమ్మాపూర్​ గ్రామస్థులు కలెక్టరేట్​ ముందు ఆందోళన చేపట్టారు. పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్​ చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ​కాసేపు కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

అనంతరం వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భువనగిరి ఏసీపీ భుజంగరావు, అధికారులు నిర్వాసితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అదనపు కలెక్టర్​ ఖీమా నాయక్​ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details