తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY: నేడు యాదాద్రికి బండి సంజయ్.. స్వామివారికి ప్రత్యేక పూజలు​ - yadadri temple latest news

BANDI SANJAY: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

నేడు యాదాద్రికి బండి సంజయ్.. స్వామివారికి ప్రత్యేక పూజలు
నేడు యాదాద్రికి బండి సంజయ్.. స్వామివారికి ప్రత్యేక పూజలు

By

Published : Apr 13, 2022, 5:39 AM IST

BANDI SANJAY: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి యాదాద్రికి బయల్దేరి వెళ్లనున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్ర రేపు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభం కానుండటంతో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి..

ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్ర విజయవంతంపై మంగళవారం భాజపా రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో యాత్ర రెండో విడత విజయవంతంపై సుధీర్ఘంగా చర్చించారు. రేపు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభం కానున్న రెండో విడత పాదయాత్ర కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇవీ చూడండి:

BJP MEETING: పార్టీ ముఖ్య నేతలతో బండి సంజయ్​ సమావేశం

పాపం చిరంజీవి.. రాధిక ఎంత పని చేసింది...!

ABOUT THE AUTHOR

...view details