తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్యాస్, నిత్యావసరాలు తగ్గించిన పార్టీకే ఓటేస్తాం: బండికి షాకిచ్చిన గ్రామస్థులు - కేసీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు

bandi sanjay comments on kcr: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. యాదాద్రి జిల్లా తాళ్లసింగారంలో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్... ప్రజలకు ఇళ్లు ఇవ్వని పాపం కేసీఆర్‌దేనని ఆరోపించారు.

bandi
ముఖ్యమంత్రిపై బండి సంజయ్‌ ఫైర్... ఆ పాపం కేసీఆర్‌దేనంటూ..

By

Published : Aug 9, 2022, 4:02 PM IST

Updated : Aug 9, 2022, 5:02 PM IST

bandi sanjay comments on kcr: ముఖ్యంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారంలో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్... కేంద్రం నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి దోచుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌ ఎదుట గ్రామస్థులు వారి సమస్యలను వెళ్లబుచ్చారు. పీఎంఏవై కింద మంజూరు ఇళ్లను కేసీఆర్ నిర్మించలేదని బండి పేర్కొన్నారు. ప్రజలకు ఇళ్లు ఇవ్వని పాపం కేసీఆర్‌దే అని మండిపడ్డారు. భాజపాను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.

Bandi Sanjay in chay pai charcha program: ఇదిలా ఉండగా... బండి వ్యాఖ్యలపై గ్రామస్థులు స్పందించారు. గ్యాస్, నిత్యావసరాల తగ్గించిన పార్టీకే ఓటేస్తామని తెలిపారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి తన కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చారని బండి తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని గ్రామస్థులకు బండి సంజయ్ వివరించారు.

har ghar tiranga: అంతకు ముందు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో భాజాపా ఆధ్వర్యంలో... హర్ ఘర్ తిరంగా ర్యాలీని బండి సంజయ్ ప్రారంభించారు. భారత దేశ గొప్పతనాన్ని పెంపొందించేలా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని... పిలుపునిచ్చారు. జాతీయ జెండా పట్టుకుని తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల 13న జెండా ఎగురవేయాలని, 14న స్వాతంత్య్ర సమరయోధులు నివాళులర్పించాలని బండి సంజయ్‌ అన్నారు. 15న ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

Last Updated : Aug 9, 2022, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details