కొవిడ్ కారణంగా విద్యార్థులు విద్యకు దూరమయ్యారని.. విద్యావిధానంలో ప్రభుత్వాలు తీసుకువచ్చిన మార్పులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: బండారు దత్తాత్రేయ - yadadri temple vips
యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: బండారు దత్తాత్రేయ
యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా వస్తోందన్న దత్తాత్రేయ.. భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి లభించాలని స్వామివారిని కోరుకున్నానన్నారు.
ఇదీ చూడండి:పదేళ్ల బాలికతో తాంత్రికుడు సజీవ దహనం