యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామం నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతిని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే రెండు దఫాలుగాకాంట్రాక్టర్లుఇసుకను తరలించారని తెలిపారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని వాపోయారు. ఇసుక తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి.. తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాల ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రమేష్‌కు గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు.
'ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి' - 'ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి'
తమ గ్రామం నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు ఇసుక తరలింపును నిలిపివేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా బండ కొత్తపల్లి ప్రజలు ఆందోళనకు దిగారు. కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన గ్రామస్థులు... జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
!['ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి' BANDA KOTHAPALLY VILLAGERS PROTESTED TO STOP SAND EVACUATION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5341321-thumbnail-3x2-ppp.jpg)
BANDA KOTHAPALLY VILLAGERS PROTESTED TO STOP SAND EVACUATION