యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల కుటుంబసమేతంగా భక్తులు తరలివచ్చి లక్ష్మీనరసింహుని దర్శించుకుని తరించారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల నుంచి రెండు గంటలన్నర సమయం వరకు పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
'యాదాద్రికి పోటెత్తిన భక్తజనం' - Bakthula_Radhi
ఆదివారం సెలవురోజు కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా పోటెత్తారు. శ్రీలక్ష్మీనరసింహులను దర్శించుకునేందుకు పిల్లాపాపలతో కుటుంబసమేతంగా రావడం వల్ల ఆలయ సన్నిధిలో సందడి పెరిగింది.
'యాదాద్రికి పోటెత్తిన భక్తజనం'