యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడం వల్ల స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం - laxminarasimha
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని సన్నిధి భక్తజనులతో పోటెత్తింది. స్వామి వారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం