యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆకాశంలో అద్భుతం కనిపించింది. గాలి సుడులు తిరుగుతూ... సన్నగా ఆకాశంలోకి వెళుతున్న దృశ్యం మండల పరిధిలోని నెమిలి కాల్వ, నాతాళ్లగూడెం, లింగరాజుపల్లి గ్రామాల్లో కనిపించింది. ఇలాంటి దృశ్యాలు మునుపెన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.
ఆకాశంలో అద్భుతం... సుడులు తిరుగుతూ నింగికేగిసిన నీరు!
పొలాల్లో నీరు ఒక్కసారిగా పైకి లేచి... సుడులు తిరుగుతూ నింగికేగిసిన దృశ్యాలు కనువిందు చేశాయి. ఇవి ఎక్కడో విదేశాల్లో కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. వాతావరణ మార్పుల్లో భాగంగా నెలకొన్న ఈ దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి.
Awesome visuals appeared in sky
పొలాల్లోని నీరు అమాంతం పైకి లేచి సుడులు తిరుగుతూ నింగికెగిసిందని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. లింగరాజుపల్లి గ్రామంలో రెండు విద్యుత్ స్తంభాలు నేల కూలాయన్నారు. ఇలాంటి దృశ్యాలు కేవలం విదేశాల్లో మాత్రమే కన్పిస్తాయని... గ్రామీణ ప్రాంతాల్లో చూడడం కొత్త అనుభూతినిచ్చిందని యువకులు తెలిపారు. ఈ దృశ్యం కొన్ని నిమిషాల పాటు ఆకాశంలో కనువిందు చేసింది.
ఇవీచూడండి:పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్
Last Updated : Jul 31, 2020, 10:36 PM IST