యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. వాహనానికి సంబంధించిన అన్ని అన్ని పత్రాలు బండిలో పెట్టుకోవాలని తెలిపారు. అలాగే శిరస్త్రాణం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐలు జాఫర్, శ్రీ రాములు, సైదులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం - ట్రాఫిక్ నియమ నిబంధనల
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం