యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చందేపల్లి, చామపూర్, నాంచారిపేట గ్రామాల్లో కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశాలతో ఏఎన్ఎం గీత ఆధ్వర్యంలో కరోనాపై కళాకారుడు చందు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఏ మాత్రం లక్షణాలున్నా వెంటనే ఆశా వర్కర్లను, మండల వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఇంటింటి సర్వేకి అందరూ సహకరించాలని ఏఎన్ఎం కోరారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కళాకారులతో కరోనాపై అవగాహన కార్యక్రమం - తెలంగాణ వార్తలు
యాదాద్రి భువగిరి జిల్లా మోటకొండూరులోని పలు గ్రామాల్లో కళాకారుల బృందం అవగాహన కార్యక్రమం చేపట్టింది. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వివరించింది. మండలంలో 52 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని అధికారులు వెల్లడించారు.
Awareness program on corona, corona awareness program
మోటకొండూరులో 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మండల అధికారులు తెలిపారు. చందేపల్లి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మున్నీ జలందర్ రెడ్డి, ఇంఛార్జి సెక్రటరీ ప్రత్యూష, వార్డ్ మెంబర్ కళ్లెం నర్సమ్మ, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల రవీందర్ రెడ్డి, ఆశా వర్కర్ పద్మ, గోసంగి పరమేశ, బోట్ల లక్ష్మీ నరసింహ, బోలుగుల రాజు తదితరులు పాల్గొన్నారు.