తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2021, 9:17 AM IST

ETV Bharat / state

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అరూర్​ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఓ అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరుకు తెలియజేయడంతో సిబ్బంది, ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు అప్రమత్తమై వివాహాన్ని ఆపారు.

child marriage
యాదాద్రి జిల్లాలో బాల్య వివాహాన్ని ఆపిన అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్​ గ్రామంలో చైల్డ్​లైన్​కి వచ్చిన సమాచారంతో అధికారులు సమన్వయంతో బాల్యవివాహాన్ని ఆపారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అరూర్ గ్రామంలో 15 సంవత్సరాలున్న మైనర్ బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అధికారులు... బాలిక తల్లిదండ్రులకు స్థానిక పోలీస్​స్టేషన్​లో కౌన్సిలింగ్ ఇచ్చారు. 2006 బాల్య వివాహల చట్టంపై అవగాహన కల్పించారు. బాలికకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. అలా కాకుండా చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హామీ పత్రం రాసిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details