ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా, వారు తమ గమ్యాన్ని జాగ్రత్తగా చేరుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పోలీసులు శ్రద్ధ వహిస్తున్నారు. రక్షక భటులంటే ప్రమాదం జరిగిన తరువాత వచ్చే వాళ్లు కాదని.. అది జరగకండా ముందు జాగ్రత్తలు చేసే వాళ్లమని చాటిచెప్తున్నారు.
ఆత్మకూర్ ఎం మండలం రహీంఖాన్పేట వద్ద రాయగిరి-మోత్కూర్ రహదారిపై బునాదిగాని కల్వర్టుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చారు. కానిస్టేబుళ్లు నరేందర్, శ్రీనివాస్ పెట్రోలింగ్ చేస్తూ ప్రమాదాలను నివారించడానికి స్థానిక యువకులతో ఈ కార్యక్రమం చేపట్టారు.