యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లోని కరోనా బాధితులకు.. సఫా స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో, రమా భాయి అంబేడ్కర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకురాలు అరుణ కొంగరి మెడికల్ కిట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. మోత్కూరు మండలం అరెగూడెం, ధర్మాపురం, కొండగడప, పాటిమట్ల, గాంధీ నగర్, ఆత్మకూరు మండలం కప్రాయపల్లిలో ఉన్న 50 మంది కరోనా భాదితులకు విటమిన్ మాత్రలను పంపిణీ చేశారు.
Corona victims: కరోనా బాధితులకు మెడికల్ కిట్లు, నిత్యావసర సరుకుల అందజేత - aruna kongari distributed medical kits to yadadri bhuvanagiri corona victims
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లోని కరోనా బాధితులకు.. సఫా స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో అరుణ కొంగరి మెడికల్ కిట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు.

కరోనా బాధితులకు మెడికల్ కిట్లు, నిత్యావసర సరుకుల అందజేత
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అరుణ కొంగరి సూచించారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు వీలైన వారు సాయం చేయాలని అన్నారు.
Last Updated : Jun 4, 2021, 7:56 PM IST